ధాన్యం కొనుగోలు విషయంలో…కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఇవాళ అధికార టీఆర్‌ఎస్ పార్టీ… ధర్నా చేస్తోంది. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన… మహా ధర్నా చేస్తోంది. అయితే..ఈ ధర్నాలో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొన్నారు.
ఇది ఇలా ఉంటే.. టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలో ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్నా చౌక్ వద్దకు వెళ్లినప్పటికీ… ఆయన స్టేజ్ మీదకు వెళ్ళకుండా… జనం మధ్యలో కూర్చున్నాడు.
కల్వకుంట్ల కవిత, మంత్రి హారీష్ రావు కూడా స్టేజ్ పైనే కూర్చున్నారు. కానీ కేటీఆర్ మాత్రం జనాల్లోనే… మామూలు కార్యకర్తగా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ ఆసక్తికర సంఘటన తెలం గాణ రాష్ట్ర రాజకీయా ల్లో హాట టాపిక్ గా మారింది. మంత్రి కేటీఆర్.. ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తు చేస్తు న్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.