ఏపీ సీఎం జగన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి. బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల పనులకు జీవో జారీ చేసి నిధులు విడుదల చేశారని.. నిధుల కోసం 6 నెలల పాటు ప్రభుత్వంతో పాటు పెద్దల చుట్టూ తిరిగానని వివరించారు.
నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు..వారం రోజుల నుండి ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. పవిత్ర రంజాన్ మాసంలో దర్గా కోసం ఉద్యమం చేపడితే నెరవేరుతుందని శ్రీకారం చుట్టాం… మా ప్రయత్నంలో విజయం సాధించామన్నారు. రాత్రి దర్గా అభివృద్ధి పనులకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇచ్చింది..ఇది నా విజయం కాదు నెల్లూరు ముస్లిం సోదరుల పోరాటమని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి.