నెల్లూరు రూరల్ లో టీడీపీ గెలుపు కోసం “మహాశక్తి చైతన్య రథయాత్ర” … !

-

వైసీపీ నుండి జంప్ అయ్యి టీడీపీ పంచిన చేరి ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి గా నియమితులు అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రోజు పొట్టేపాలం లో మహాశక్తి చైతన్య రథయాత్ర ను ప్రారంభించారు. ఈ రథయాత్ర లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , మాజీ మునిసిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ పాల్గొన్నారు. కాగా ఈ రథయాత్రలో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని మీరు గెలిపిస్తే … 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి అన్న పధకం క్రింద ప్రతి నెల రూ.1500 చొప్పున ఇస్తామన్నారు. అదే విధంగా తల్లికివందనం పేరుతో మీ ఇంట్లో చదువుకునే ప్రతి బిడ్డకూ కూడా సంవత్సరానికి రూ. 15 వేలు అందిస్తామని శ్రీధర్ రెడ్డి తెలియచేశారు.

ఇంకా దీపం అన్న కొత్త పధకం ద్వారా ప్రతి ఇంటికి సంవత్సరంలో మూడు సిలిండర్ లను ఉచితంగా అందిస్తామని కోటంరెడ్డి ప్రజలకు చెప్పడం జరిగింది. ఇవన్నీ వివరించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news