తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులని మాత్రం ఈ కరోనా టెన్షన్ పెడుతోంది. మొన్నటికి మొన్న చిరంజీవి ప్రగతి భవన్ లో కేసీఆర్ ని కలిసి వెళ్ళిన రెండు రోజులకే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రగతి భవన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. హుటాహుటిన అందరూ కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నారు. ఈ క్రమంలో మరెవరికీ సోకకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం అనే చెప్పాలి.
అయితే ఇప్పుడు టీఆర్ఎస్ కు చెందిన ఒక ఎంపీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన మరెవరో కాదు నిజామాబాద్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. నిన్న నే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎంపి నిన్న సాయంత్రం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే పరీక్షల అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్దారించారు. దీంతో సురేష్ రెడ్డి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. తనతో కొద్ది రోజులుగా కాంటాక్ట్ అయిన వారిని కూడా టెస్ట్ చేయిన్చుకోవాల్సిందిగా ఆయన కోరారు.