దక్షిణ కొరియాకు చెందిన గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ ఇటీవలే పబ్‌జి కి పేరుమార్చి బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరిట మళ్లీ పబ్‌జి గేమ్‌ను భారత్ లో లాంచ్ చేసిన విషయం విదితమే. జూలైలో ఆ సంస్థ ఈగేమ్‌ను లాంచ్ చేసింది. అయితే క్రాఫ్టన్ కంపెనీ పబ్‌జి సిరీస్‌లోనే ఇంకో కొత్త గేమ్‌ను అప్పట్లోనే ప్రకటించింది. చెప్పినట్లుగానే ఆ గేమ్‌ను క్రాఫ్టన్ త్వరలో లాంచ్ చేయనుంది.
క్రాఫ్టన్ సంస్థ పబ్‌జిలో ఇంకో కొత్త గేమ్‌ను పబ్‌జి: న్యూస్టేట్ పేరిట త్వరలో లాంచ్ చేయనుంది. ఈ గేమ్ కూడా అచ్చం పబ్‌జి లాగే ఉంటుంది. కాకపోతే 2051వ సంవత్సరంలో జరిగినట్లుగా గేమ్ మోడ్, గ్రాఫిక్స్ ఉంటాయి. అత్యాధునిక వెపన్, ఆర్మర్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తారు.
ఇక పబ్‌జి: న్యూస్టేట్ గేమ్‌ను గతంలోనే క్రాఫ్టన్ అనౌన్స్ చేసింది. అయితే త్వరలో ఈ గేమ్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ గేమ్‌కు గాను ఆల్పా టెస్ట్ వెర్షన్‌ను ఇటీవల లాంచ్ చేశారు. అందులో అనేక బగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని సరిచేసి త్వరలో బీటా వెర్షన్‌ను ఆ తరువాత పూర్తి స్థాయి వెర్షన్‌ను లాంచ్ చేస్తారు.
పబ్‌జి: న్యూస్టేట్ గేమ్‌కు గాను యూజర్లు ముందస్తుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీంతో గేమ్ లాంచ్ కాగానే నోటిఫికేషన్ వస్తుంది. ఆపై వెంటనే గేమ్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవచ్చు. తరువాత గేమ్ ఆడవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఈ గేమ్‌కు ప్రీ రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు.