మంత్రి హరీష్ రావుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. హరీష్ రావు హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారని.. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. తాను అభివృద్ది చేయలేదనట్టున్న హరీష్ రావు.. దమ్ముంటే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు రావాలని ఈటల సవాలు విసిరారు.
“ఈ చర్చకు నేనే అన్నీ ఏర్పాట్లు చేస్తా.. నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ వి కదా బహిరంగ చర్చకు సిద్దామా ?” అని సవాల్ విసిరారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ప్రతి మాట లో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే.. నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుంకుమ భరిణాలు పంపించి ఓట్లు అడిగేస్తాయికి దిగజారినవని హరీష్ కు చురకలు అంటించారు. నీ వెంట నాయకులు లేరు నా వెంటే ఉన్నారు అని ఆరోపణలు చేస్తున్నారని.. మండిపడ్డారు. ఎన్ని పై ఎత్తులు వేసినా విజయం తనదేనని పేర్కొన్నారు ఈటల రాజేందర్.