నేను ఒంటరిని అయిపోయాను : వైఎస్ షర్మిల ట్వీట్

తెలంగాణ వైఎస్ఆర్ టిపి పార్టీ అధినేత వైఎస్ షర్మిల తన ట్విటర్ వేదికగా ఆసక్తి కర ట్వీట్ చేశారు. తాను ఒంటరిని అయ్యానని.. అయినా విజయం సాధించాలని… అవమానాలెదురైనా ఎదురీదాలని నిర్ణయం తీసుకున్నానని భావోద్వేగ ట్వీట్ చేసింది వైఎస్ షర్మిల. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని… ఎప్పుడూ ప్రేమనే పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

తన వెన్నంటి నిలిచి , ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారని తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు వైఎస్ షర్మిల. నాకు బాధౌస్తే మీ కంట్లోంచి నీరు కారేదని… ఈ రోజు నా కన్నీరు ఆగనంటుందని ఎమోషనల్ అయింది వైఎస్ షర్మిల. ఐ లవ్ యు నాన్న.. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ వైఎస్ షర్మిల పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం తన అన్న ఏపీ సిఎం జగన్ తో కలిసి..వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి  వైఎస్ షర్మిల నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.