బీఆర్ఎస్ ని వీడగానే రాజయ్య పై క్రిషాంక్ వివాదస్పద ట్వీట్..!

-

బీఆర్ఎస్ కి కొద్దిసేపటి క్రితమే మాజీ డిప్యూటీ సీఎం,  స్టేషన్ ఘనపూర్  మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ని రాజయ్య వీడిన అంశంపై మాజీ తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ వ్యాఖ్యలు  ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. థాంక్యూ.. రాజయ్య గారు మొత్తానికి బీఆర్ఎస్ ను వీడినందుకు మీరు చేరే పార్టీలోనే మహిళలను ఆ దేవుడే రక్షించాలి అంటూ క్రిశాంక్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

మహిళలను వేధిస్తున్నట్టు తెలిసినా మీరు ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోలేదు. అతనిలోని డార్క్ షేడ్ మీ పార్టీని వీడిన తర్వాతనే గుర్తుకొచ్చిందా..? డర్టీ పాలిటిక్స్ అయితే పింకీలు ఉమనైజర్లని మీరు అంగీకరిస్తున్నారా..? మీ పార్టీలో ఉన్నప్పుడు మహిళల గురించి ఆలోచించావా మైండ్ ఉంది మాట్లాడుతున్నావా..? ఇన్నాళ్లు మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళని మీరు సేవ్ చేయకుండా పబ్బం గడుపుతున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు. రాజయ్య పై  ఆనాడు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మహిళల మీద ప్రేమ వలకపోయడమేంటని క్రిశాంక్ పై నెటిజన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news