కృష్ణా జిల్లా ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. గన్నవరం నుంచి ముంబైకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ మేరకు విమాన సర్వీసులను ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంపీలు కేశినేని నాని, బాలశౌరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు కావాలని ఆకాంక్షించారు. గన్నవరం నుంచి మరిన్ని విమానయాన సర్వీసులను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టులో నిర్మిస్తున్న కొత్త టెర్నినల్‌ను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇంటర్నేషనల్ కనెక్టివిటీని కలుపుతామని ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి వెల్లడించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఇకపై సీఐఎస్‌ఎఫ్ భద్రత జులై 2 నుంచి అమల్లోకి రానున్నట్టు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటి వరకు ఎస్పీఎఫ్, స్పెషల్ పోలీస్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో భద్రత సేవలు అందనున్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీకి లేఖ ద్వారా ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ వెల్లడించారు.