కృష్ణ.. ఫ్యాన్ అసోసియేషన్ గా పనిచేసిన మెగాస్టార్..!!

-

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖైదీ చిత్రంతో తన స్టార్డం అందుకున్న చిరంజీవి ఆ తరువాత వరుస పెట్టి సినిమాలను తెరకెక్కించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి నటనపరంగా, డాన్స్ పరంగా, డైలాగులుపరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయని చెప్పవచ్చు. కృష్ణ , ఎన్టీఆర్ , ఏఎన్నార్ తదితర హీరోలను ఆదర్శంగా తీసుకొని హీరోగా ఎదిగానని ఎన్నోసార్లు తెలియజేశారు. ఇక టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి.

అయితే కొంతకాలం రాజకీయపరంగా సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి చాలా సతమతమవుతున్న సమయంలో తిరిగి సినిమాలలో నటించాలని ఖైదీ నెంబర్ 150 చిత్రంతో తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. అయితే చిరంజీవి కూడా అప్పట్లో ఒక స్టార్ హీరో అభిమాని మాత్రమే కాకుండా ఫ్యాన్స్ అసోసియేషన్కు కూడా అధ్యక్షునిగా పనిచేశారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు నట శేఖర్ సూపర్ స్టార్ కృష్ణ. చిరంజీవి పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్కు ప్రెసిడెంట్ అనే సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

అయితే తాజాగా కృష్ణ మరణించడంతో ఈ విషయం కాస్త మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందుకు సంబంధించి ఒక పాంప్లేట్ కూడా వైరల్ గా మారుతోంది. అందులో కృష్ణ, చిరంజీవి కలిసి నటించిన తోడుదొంగలు సినిమా త్వరలో విడుదల కాబోతోంది అని పాంప్లెట్ లో చూపించడం జరిగింది. అయితే దీంతో మెగా అభిమానులు సూపర్ స్టార్ అభిమానులు ఒక్కసారిగా ఈ ఫోటోను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఘట్టమనేని అభిమానులకు కృష్ణ లేని లోటు తీర్చలేనిదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news