KrishnaVrindaVihari : ‘కృష్ణ వ్రిందా విహారి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

-

 

 

 

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డజన్‌ కు పైగా సినిమాలు చేశాడు. ఇందులో కొన్ని సినిమాలు హిట్‌ కాగా మరికొన్ని ఫట్టాయ్యాయి. దీంతో స్టార్‌ డమ్‌ కోసం హీరో నాగ శౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా కృషి చేస్తున్నాడో లక్ష్య చిత్రం చూస్తేనే తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం నాగశౌర్య.. “కృష్ణ వ్రిద్ధ విహారి” అనే డిఫరెంట్‌ టైటిల్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ఉషా ములంపూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మహానటి స్వర సాగర్‌ ఈ సినిమా కు సంగతీ స్వరాలు అందించనున్నాడు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజ్‌ అప్డేట్‌ ను వదలింది చిత్ర బృందం. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది. ఈ మేరకు రొమాంటిక్ పోస్టర్ను కూడా వదిలింది.

Read more RELATED
Recommended to you

Latest news