ప్ర‌భాస్ కు అదెక్కువే..కృతిస‌న‌న్ షాకింగ్ కామెంట్స్..!

-

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ రావ‌ణ్ పాత్రలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

కాగా తాజాగా కృతిస‌న‌న్ ప్ర‌భాస్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీత పాత్రలో న‌టిస్తున్నందుకు త‌న‌కు చాలా ఆనందంగా ఉంద‌ని కృతి స‌న‌న్ అన్నారు. ప్ర‌భాస్ చాలా మంచి వ్య‌క్తి అని అంద‌రితో స‌ర‌దాగా ఉంటార‌ని అన్నారు. అంతే కాకుండా ప్ర‌భాస్ భోజ‌న ప్రియుడ‌ని…ప్ర‌భాస్ కు విన‌యం కూడా ఎక్కువేన‌ని అన్నారు. ప్ర‌భాస్ తో స్నేహం భాగా న‌చ్చింద‌ని ఒక్క‌సారి ప‌రిచ‌యం అయితే ఎంతో భాగా మాట్లాడుతాడ‌ని కృతిస‌న‌న్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news