వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన గురించి అందరికీ తెలిసిందే. సాగు చట్టాలని వెనక్కి తీసుకోవాలని, వాటివల్ల కార్పోరేట్లకి బానిసలుగా రైతులు మారాల్సి వస్తుందని, అందుకే వీలైనంత తొందరగా వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ వేదికగా రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం, రైతు చట్టాలని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని, వాటివల్ల కనీస మద్దతు ధర ఉండరని అనుకుంటున్నారని, కానీ అలా జరగదని చెబుతున్నారు.
తాజా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్య సభలో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల గురించి ఇలా అన్నాడు. కనీస మద్దతు ధర ఉండదని వార్తలని నమ్మకూడదని, వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధర ఉండదనుకోవడం ఉట్టి అపోహ మాత్రమే అని, రాజ్యసభ సాక్షిగా మోదీ మాట్లాడారు. దేశ్ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న రైతుల నిరసనకి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. ఇప్పటికే ఫారెన్ సెలెబ్రిటీలు చాలా మంది, రైతుల నిరసనలకి మద్దతు తెలుపుతున్నారు.