అలాంటి అవతారంలో కనిపించిన కృతి శెట్టి..!

-

ఉప్పెన సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా ద్వారా వచ్చిన పాపులారిటీతో మరో రెండు స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకొని.. వాటితో కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో కాస్త తడబడిన ఈమె ప్రస్తుతం ఈమె చేతిలో కేవలం నాగచైతన్యతో నటిస్తున్న ఒక్క సినిమా మాత్రమే ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె ఖాళీగా ఉండడంతో వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అంతేకాదు వరుస సినిమాలతో అవకాశాలు పొందినప్పుడు కోటి రూపాయల వరకు పారితోషకం డిమాండ్ చేసింది. ఇంత చిన్న వయసులోనే హీరోయిన్గా పరిచయమైన మంచి క్రేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది . నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్చల్ చేసి ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఇన్ స్టా లో కూడా ఏదో ఒక పోస్ట్ తో అందరి దృష్టిలో పడుతున్న ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా అవతార్ ఫిల్టర్స్ ద్వారా తన ఫోటోలను ఎడిట్ చేసింది. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అభిమానులు విపరీతంగా లైక్స్ కొడుతున్నారు . అంతేకాదు నీలో ఇలాంటి హొయలు కూడా ఉన్నాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు . మొత్తానికైతే బేబమ్మ పెట్టిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇందులో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

https://www.instagram.com/p/CmbsYw-pG9N/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news