ఫ్యాక్ట్ చెక్: NIC పంపుతున్న ఈమెయిల్స్ ని నమ్మచ్చా..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో నకిలీ వార్తలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. వీటిని నమ్మితే ఇక అంతే. సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక నకిలీ వార్త కనబడుతూ ఉంటుంది. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం.

నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ వార్త సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది. ”నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్” కి సంబంధించి వస్తున్నా మెయిల్స్ నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ మెయిల్స్ ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పంపిస్తోందా..?, చెప్పినట్టు ఇచ్చిన లింక్ మీద మనం క్లిక్ చేసేస్తే ప్రొఫైల్ ని వెరిఫై చేస్తారా..? ఇక ఇది నిజమా కాదా అనేది చూస్తే.. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పేరు మీద వచ్చిన ఈ మెయిల్స్ ఏమి నిజం కాదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. ఇటువంటి నకిలీ వార్తలను అనవసరంగా నమ్మి మోసపోకండి. వివిధ ప్రభుత్వ డిపార్టుమెంట్లకి ఇలాంటి మెయిల్స్ ని పంపించారు. జాగ్రత్తగా వుండండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news