సైలెంట్ అయిన కృతి శెట్టి.. కెరియర్ పరిస్థితి ఏంటి..?

-

ఉప్పెన సినిమాతో ఉప్పెనలాగా టాలీవుడ్ లో ఇండస్ట్రీలోకి దూసుకు వచ్చింది హీరోయిన్ కృతి శెట్టి.. తన అంద చందాలతో దూసుకు వచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే వరుసగా అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. వరుసగా మూడు సినిమాల సక్సెస్ కావడంతో హ్యాట్రిక్ హిట్టు కొట్టి లక్కీ హీరోయిన్గా పేరుపొందింది.

ఇక ఈమె కెరీర్ కు ఎలాంటి డోకా లేదు అనుకుంటున్నా సమయంలోనే వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. అంతేకాకుండా కృతి శెట్టి తర్వాత శ్రీ లీల మంచి పాపులారిటీ సంపాదించడంతో కృతి శెట్టి హవా ఈ మధ్య కాస్త తగ్గిపోయిందని చెప్పవచ్చు. వీటితోపాటు వరుసగా సినిమాలు ప్లాప్ అవడంతో స్టార్ హీరోలతో నటించే అవకాశాలు అన్ని చేజారిపోయాయి. ఒక్కసారిగా ఈమె కెరీర్ కు బ్రేక్ పడిందని చెప్పవచ్చు. కథ సెలక్షన్ల విషయంలో ఏ హీరోల సినిమాలు చేయాలనే విషయంలో ఇంకా ఇప్పటికి ఈమెకు క్లారిటీ రాలేదన్న విమర్శ వినిపిస్తోంది.

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్,బంగార్రాజు సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. ఆ తరువాత దీవారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె చేతిలో నాగచైతన్య నాటిస్తున్న కస్టడీ సినిమా తప్ప మరే సినిమాలో నటించలేదు.గతంలో మాదిరి ఈ మధ్య కృతి శెట్టి గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోవడం లేదు. రాబోయే రోజుల్లో ఈమెకు ఆఫర్లు కూడా వచ్చేది కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెంచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. పలు రకాలుగా బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news