కేటీఆర్ ఆస్తులు ఆరు రెట్లు పెరిగాయి: మాణిక్యం ఠాకూర్

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ” ఆస్క్ కేటీఆర్ ” అనే కార్యక్రమాన్ని ఆదివారం రోజున నిర్వహించారు. ఇందుకు స్పందించిన మాణిక్యం ఠాకూర్ అదే వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఆస్తులు పెంచుకోవడానికి రహస్యమేంటో కేటీఆర్ రాష్ట్ర యువతకు చెప్పాలని వ్యాంగ్యంగా కామెంట్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్లో తనకు రూ. 7 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారని..

2018 వచ్చే వరకు కేటీఆర్ ఆస్తులు రూ. 41 కోట్లకు పెరిగాయని తెలిపారు.2018 నుంచి 2023 వరకు టార్గెట్ ఎంత అంటూ కేటీఆర్ ని ప్రశ్నించారు మణిక్యం ఠాకూర్.కాగా ” ఆస్క్ కేటీఆర్ “కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కి ట్వీట్ల వర్షం కురిపించారు నెటిజన్లు.పొలిటికల్, పర్సనల్, స్పోర్ట్స్, అనే తేడా లేకుండా ఎవరికి నచ్చిన విధంగా వారు ట్వీట్ చేశారు.వారి ట్వీట్లకు అంతే కూల్ సమాధానమిచ్చారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news