మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేటీఆర్ సవాల్..!

-

తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ వస్తే.. మార్పు మార్పు అన్నారు. మార్పు మార్పు అంటే పథకాలకు కేవలం పేరు మార్చారని తెలిపారు. రైతుబంధు ఎన్నికల ముందు అయితే 5వేలు.. ఎన్నికల తరువాత అయితే రూ.7,500 ఇస్తామన్నారు.. ఏడాది దాటినా ఇవ్వలేదన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉచిత కరెంట్ అని చెప్పే హక్కు ఒక్క కాంగ్రెస్ కే ఉందన్నారు.  బీఆర్ఎస్ హయాంలో లాగ్ బుక్ తీసుకొచ్చి చూపిస్తా.. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారో లేదోనని మంత్రి పేర్కొన్నారు. వెంటనే కేటీఆర్ సభ వాయిదా వేసి అందరం నల్గొండ పోదాం.. ఈ రోజు ఒక్క లాగ్ బుక్కులో అయినా.. 24 గంటలు కరెంటు వస్తున్నట్టు చూపిస్తే మేము మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని సవాల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version