ఉద్యోగం వదిలి దేశసేవ కోసం వచ్చా : కేటీఆర్

-

తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కెటిఆర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కిస్మత్ పూర్ లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో ఐ టెక్నాలజీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ…దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశ్యం తోనే అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి ఇక్కడికి వచ్చానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు భారత్ ఇప్పుడు ఉన్నట్టు లేదని విదేశీ పెట్టుబడుల్లో చాలా మార్పులు వచ్చాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు.ktr

అంతే కాకుండా ప్రపంచం లోనే ఎక్కడా లేని పథకాలు తెలంగాణ లో అమలవుతున్నాయి అని కెటిఆర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా కెటిఆర్ ప్రస్తుతం తెలంగాణ ఐటి శాఖ మంత్రిగా మరియు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తన మాట తీరు రాజకీయ వ్యూహాలతో కేటీఆర్ తండ్రిని మించిన తనయుడు అని ఇప్పటికే అనిపించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news