ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడానికి ఈటెల రాజేందర్ కి సిగ్గు ఉండాలని ఘాటుగా విమర్శించారు కేటీఆర్. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట్ లో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం మల్కాజ్గిరి లోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం విమర్శించారు. దేశవ్యాప్తంగా అని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఒక్క కాలేజ్ ని కూడా ఇవ్వలేదని అన్నారు.
కొత్త జిల్లాలకి రావాల్సిన నవోదయ పాఠశాలలను సైతం కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బిజెపితో పోటీ ఉంటుందని కేటీఆర్ అన్నారు. బిజెపిలోకి రేవంత్ రెడ్డి వచ్చేస్తారని అసలు రేవంత్ రెడ్డి గాంధీ కోసం పనిచేస్తున్నాడా లేదంటే మోడీ కోసం పనిచేస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి అని కేటీఆర్ అన్నారు. కేంద్రాన్ని రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడని అందరూ గమనించాలని అన్నారు.