పుష్ప-2 టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

-

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2”  కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎదురు చూస్తుండగా ఈ ఏప్రిల్ నెల మొదలు కానుండడంతోనే మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ అందిస్తున్నట్టుగా రంగం సిద్ధం చేశారు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప 2 మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 08న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ మాస్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇక పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15, 2024న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news