హుస్సేన్ సాగ‌ర్‌లో గ్యాస్ సిలిండ‌ర్‌, బైక్‌ల తోసివేత… కేటీఆర్ ఫైర్

-

దేశంలో వంట గ్యాస్, చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్(Gas cylinder), ఇంధన ధ‌ర‌ల‌కు నిరసనగా ప్రతిపక్షాలతో పాటు ప్రజలు వివిధ పద్దతుల్లో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా హైద‌రాబాద్ లో గ్యాస్ సిలిండ‌ర్ ధర పెంపునకు నిరసనగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు హుస్సేన్ సాగ‌ర్‌లో గ్యాస్ సిలిండ‌ర్‌ తోసివేసారు. అలానే మరో కార్యక్రమంలో పెట్రో ధరల పెంపునకు నిరసనగా కొంతమంది ద్విచక్ర వాహనాన్ని సాగ‌ర్‌లో తోసేశారు.

గ్యాస్ సిలిండ‌ర్‌/ Gas cylinder
గ్యాస్ సిలిండ‌ర్‌/ Gas cylinder

అయితే ఈ ఘ‌ట‌న‌లపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించ‌డానికి.. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న ప్ర‌ధాన అంశ‌మే.. కానీ బాధ్య‌తారాహిత్యంగా బైక్‌ల‌ను, సిలిండ‌ర్ల‌ను చెరువుల్లో తోసేయ‌డం ఖండించదగినది అని ట్వీట్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సందర్భంగా హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిలకు కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news