మనలో మనకే ఓర్వలేని తనం.. అందుకే ఓడిపోయాం: కేటీఆర్‌

-

వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ బూత్ కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యకర్తల భేటీకి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించారు. మనలో మనకే ఓర్వలేని తనం ఎక్కువైందని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని మనమే ఓడించుకున్నామని అన్నారు. ఒకరికి పెత్తనం ఇస్తే మరొకరికి కోపం వస్తుందని.. ఈ ఓర్వలేనితనం వల్లే పార్టీలో సమన్వయలోపం జరిగిందని.. లోక్సభ ఎన్నికల్లో అలా జరగకుండా అప్రమత్తం అయ్యామని తెలిపారు.

మరోవైపు బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. పదేళ్లలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. అన్ని ధరలు పిరం చేసిన పిరమైన ప్రధాని.. మోదీ అని విమర్శించారు. మతం పేరుతో ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని, అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్కు కనీసం వంద మందికి పైగా కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. అదే బీజేపీ ఒకరిద్దరున్నా వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. ఆ ఒక్కరిద్దరిపై బీఆర్ఎస్ పైచేయి సాధించలేకపోతోందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news