వైసీపీకి మద్దతు ఇవ్వడంపై అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన !

-

వైసీపీకి మద్దతు ఇవ్వడంపై అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన చేశాడు. ఇవాళ హైదరాబాద్‌ లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్‌.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్… నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్నారు. మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎపుడూ ఉంటుందని వెల్లడించారు.

Allu Arjun’s sensational statement on supporting YCP

శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు అతనికి మద్దతు ఇస్తాను అని గతంలో మాట ఇచ్చానని వివరించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను….నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news