కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలటరీ ఇష్టా రీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
కంటోన్మెంట్ రోడ్లు మూసి వేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు కేటీఆర్. ఈ రోడ్ల మూసివేత అంశానికి సంబంధించి పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామని పేర్కొన్న కేటీఆర్… గతంలోని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రేకలు రాసినా విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాజాగా లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేటు రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డు వంటి కీలకమైన నాలుగు రోడ్లను కరోనా పేరుతో మూసివేయడం కారణంగా… వేల మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని కేటీఆర్ అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి త్వరగా స్పందించాలన కోరారు కేటీఆర్.