రాజీపడే ప్రసక్తే లేదు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనూ కొట్లాడతాం : కేటీఆర్

-

రెండు తెలుగు రాష్ట్రాలలో జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నేతలు.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో.. ఈ వివాదంపై తనదైన స్టైల్ లో మంత్రి కేటీఆర్ స్పందించారు. నీటి విషయంలో.. ఏపీతోనే కాదు.. దేవుడితో కొట్లాడతామని స్పష్టం చేశారు కేటీఆర్‌. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని.. మంత్రి కేటీఆర్‌ అన్నారు.

చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని.. కేసీఆర్‌ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామన్నారు. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. భారత దేశంలో అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రం గా తెలంగాణ నిలిచిందన్నారు.

ఊహించని విధంగా వరి పంట పండిందని…రైతుల దగ్గర పంట కొన్నామని పేర్కొన్నారు. 10 కోట్ల రూపాయలతో టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసామని…చేనేత భీమా పథకాన్ని సీఎం కెసిఆర్ ప్రకటించారని వెల్లడించారు. గతంలో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి.. ఇప్పుడు రోజు తప్పించి రోజు మంచి నీరు అందిస్తున్నామన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news