టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుమారుడికి అంతర్జాతీయ అవార్డు లభించింది. సామాజిక సేవ చేస్తున్నందుకు కేటీఆర్ కొడుకు హిమాన్ష్ (15) కు డయానా అనే అంతర్జాతీయ పురస్కారం దక్కింది. కాగా బ్రిటన్‌లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలందించే 9-25 ఏళ్ల మధ్య వయసు వారికి ఆ సంస్థ ఈ అవార్డును ఇస్తుంది. దివంగత వేల్స్ రాజకుమారి డయానా పేరిట ఈ అవార్డును నెలకొల్పారు.కాగా కేటీఆర్ తనయుడు హిమాన్ష్ ‘శోమ’ అనే పేరుతో గజ్వేల్ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసుఫ్‌ఖాన్‌పల్లి గ్రామాల స్వయం సమృద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టారు. హిమాన్ష్ సామాజిక సేవకు గుర్తింపుగా ఆ సంస్థ డయానా అవార్డు ప్రకటించింది.
హిమాన్ష్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రాజెక్టుకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రాజెక్టుకు తాత కేసీఆర్ కూడా మార్గదర్శనం చేసినట్లు వెల్లడించారు. ఇక హిమాన్ష్‌కు అవార్డు రావడం పట్ల తండ్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు. అంతర్జాతీయ పురస్కారం దక్కించుకున్నదుకు హిమాన్ష్‌కు అభినందనలు తెలపడంతో పాటు తండ్రిగా గర్విస్తున్నానన్నారు.
https://twitter.com/TheRealHimanshu