రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అనే విషయం తెలిసిందే. ఓవైపు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ అభివృద్ధి కార్యక్రమాల పనులు ఎంతవరకు జరిగాయో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా కేటీఆర్ సమీకృత మార్కెట్ల గురించి ట్వీట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత మార్కెట్లు శరవేగంగా ఏర్పాటు అవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా మార్కెట్లలో శాకాహారంతోపాటు మాంసాహారం లభిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర పురపాలక శాఖ నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఖమ్మం, నారాయణపేట, భువనగిరిలో అందుబాటులోకి వచ్చిన మార్కెట్ల ఫొటోలను షేర్ చేశారు. మార్కెట్ల నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు, పురపాలక ఛైర్మన్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో అభినందించారు.
These pics👇are from Narayanpet town and Bhuvanagiri town
My compliments to MLAs @SRReddyTRS Garu and @PaillaShekarTRS Garu and the Municipal Chairmans 👏 pic.twitter.com/Il1DZ9bTP7
— KTR (@KTRBRS) February 14, 2023