కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగేది అప్పుడే..!

-

తెలంగాణ హైకోర్టు లో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అయితే అదే రోజు సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ ఏసీబీ విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. రేపు విచారణ చేపట్టాలని కోరడంతో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 15న అనగా బుధవారం రోజు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కవిత విచారణ మాదిరిగానే కేటీఆర్ ను విచారించి జైలుకు పంపిస్తారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కేటీఆర్ విచారణ కొసాగుతోంది. మరోవైపు ఈడీ కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద రిపోర్టర్లతో అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. విధుల్లో ఉన్న జర్నలిస్టులను పోలీస్ అధికారి  నెట్టేయడంతో జర్నలిస్టులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news