దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఉన్నావ్ బాధితురాలి యాక్సిడెంట్ కేసులో బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్ నిర్ధోషి గా ప్రకటిస్తు ఢిల్లీ లోని ది రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును ఇచ్చింది. కాగ 2019 లో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తో పాటు ఆమె తరపున వాదించే న్యాయవాది ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురి అయింది. అయితే ఈ యాక్సిడెంట్ కు కారణం కుల్ దీప్ సెంగార్ అని కేసు నమోదు అయింది.
సెంగార్ తో పాటు మొత్తం 12 మంది ఈ ఘటనలో నిందితులు గా తేలారు. అయితే ఈ యాక్సిడెంట్ కుల్‌దీప్ సెంగారే చేయించాడు అనటానికి స్పష్ట మైన సాక్ష్యాలు లేవని సీబీఐ కోర్టు కు తెలిపింది. దీంతో సెంగర్ ను ఢిల్లీ కోర్టు నిర్ధోషి గా ప్రకటించింది. అయితే ఉన్నావ్ అత్యాచార ఘటన లో కుల్‌దీప్ సెంగర్ కు తీస్ హజరీ కోర్టు ఇప్పటి కే యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే రూ. 25 లక్షల జరిమానా విధించింది.