డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాపి.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రమాదమే : WHO వార్నింగ్

-

దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న… ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలు ప్రస్తుతం అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు పైగా వ్యాప్తి చెందిందనీ… వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు మన ఇండియాలోనూ.. ఈ మహమ్మారి క్రమ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే మనదేశంలో 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్నింగ్ ఇచ్చింది.

ఓమిక్రాన్ వేరియంట్… డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని… ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న, కరుణ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులలో ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ” డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పుడు స్థిరమైన ఆధారాలు ఉన్నాయి” ప్రపంచ ఆరోగ్య సంస్థ జనరల్ డ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news