2019 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కి చంద్రబాబు పార్టీని నడిపించడానికి ముప్పతిప్పలు పడుతున్నారు. కొద్దిపాటి తేడాలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఐటి దాడులు ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇటువంటి తరుణంలో రాజకీయంగా చంద్రబాబుకి చెక్ పెట్టడానికి ఇదే టైం అని భావిస్తున్న వైసీపీ తన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మేటర్ లోకి వెళ్తే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నడిబొడ్డులో బిత్తరపోయే షాక్ చంద్రబాబుకి ఇవ్వటానికి అదిరిపోయే స్కెచ్ అధికార పార్టీ వైసీపీ వేసినట్లు సమాచారం.
ఇటీవల జగన్ కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా గుర్తించడం జరిగింది. బాబు హయాంలో కూడా ఈ విధంగా జరగకపోవడంతో జగన్ అధికారంలోకి వచ్చాక కుప్పంలో అధికమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో జగన్ కి మంచి పాజిటివ్ వేవ్ ఏర్పడింది. దీంతో రాబోయే ఎన్నికల్లో లోపు చంద్రబాబుకి గట్టి పోటీ ఇచ్చే విధంగా కుప్పం నియోజకవర్గంలో భరత్ అనే యువ నాయకుడిని వైసిపి రంగంలోకి దింపింది. భరత్ వైసిపి పార్టీ ఇన్చార్జి చంద్రమౌళి కొడుకు. దీంతో తాజాగా ఆయన కుమారుడు భరత్ రంగంలోకి దిగడంతో ఇన్చార్జి బాధ్యతలు భరత్ కి ఇవ్వడానికి వైసిపి పార్టీ హై కమాండ్ డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు అని మనందరికీ తెలిసినదే.
ఇటువంటి తరుణంలో వైసిపి పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ భరత్ అడిగితే కుప్పం అభివృద్ధికి ఎన్ని వందల కోట్లు అడిగిన ఇబ్బంది లేకుండా ఇస్తామని చెప్పటం జరిగింది. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఉన్న చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు భరత్ వెంట నడవడానికి ఇష్టపడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వైసీపీ పార్టీలోకి రావడానికి ఎక్కువ మంది టిడిపి క్యాడర్ రెడీగా ఉంది. దీంతో చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పం లో కూడా చంద్రబాబు కి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా అద్భుతమైన స్కెచ్ వైసిపి భరత్ రూపంలో.