మహిళలకి బంపర్ ఆఫర్…జాబ్ చేయకపోయినా..చదువుని బట్టి జీతం…

-

ఇంటర్ చదివినా అంతకంటే తక్కువ చదివినా సరే నెలకి లక్ష రూపాయలు జీతం. అలాగే  సెకండరీ అర్హత ఉన్న మహిళలకి జీతం 1.28 లక్షలు జీతం. డిప్లమో చదివిన వారికి 1.40 లక్షల జీతం. డిగ్రీ అర్హత మహిళలకి 1.50 లక్షల జీతం. పీజీ చేసిన మహిళలకి 1.70 లక్షల జీతం. నెలనెలా ప్రభుత్వమే చెల్లించే విధంగా అది కూడా మహిళలు ఉద్యోగం చేయకపోయినా, ఇంట్లోనే ఉన్నా ఖాతాలలో జమ అవుతుంది.

ఏంటి షాక్ తిన్నారా, ఇది నిజమేనా అంటూ మీ అర్హతల ఫైల్స్ తిప్పకండి. ఎందుకంటే ఇది మనదేశంలో కాదు. కువైట్ లో అదికూడా ఇలాంటి పద్దతిని మహిళల కోసం అమలు చేయాలని కువైట్ లోని ఓ ఎంపీ ప్రతిపాదన చేశారు. చదువుకుని ఉద్యోగాలు చేయని మహిళలు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది  వారి భర్తల ఇళ్ళ వద్ద అవమానాలు పొందుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఈ విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు.

దాంతో సదరు ఎంపీ మజీద్ అల్ పై దేశవ్యాప్తంగా నిరసనలు రేగాయి. ఇదేమి ప్రతిపాదన పిచ్చిగానీ పట్టిందా ఏంటి అంటూ అందరూ చివాట్లు పెడుతున్నారు. మహిళలు బయటకి వెళ్లి ఉద్యోగం చేయకూడదా కేవలం ఇంటికే పరిమితం అవ్వాలా ,ఇలాంటి విధానం వలన ఎంతటి నష్టం వాటిల్లుతోందో తెలుసా అంటూ చెడామడా తిట్టిపోస్తున్నారు. ఇలా ఎంపీని తిట్టి పోస్తున్న వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం ఎంపీకి తలంటు అంటుతున్న నేపధ్యంలో మళ్ళీ ఎంపీ వివరణ ఇచ్చారు. మహిలలో ఎంతో మంది పెళ్లి తరువాత ఇబ్బందులు పడుతున్నారు అందుకే నేను కేవలం పెళ్ళయిన మహిళల గూర్చి ఈ ప్రతిపాదన తీసుకువచ్చానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news