ఐఆర్సీటీసీ ఎన్నో ప్యాకేజీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఆర్సీటీసీ అందించే ప్యాకేజీలతో లద్దాఖ్, లేహ్ వంటి ప్రాంతాలను కూడా చూసొచ్చేయచ్చు. అయితే మరి లద్దాఖ్, లేహ్ ని ఎలా చూసొచ్చేయచ్చు…?, టూర్ వివరాలు వంటివి చూద్దాం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
హైదరాబాద్ నుండి లద్దాఖ్, లేహ్:
ఐఆర్సీటీసీ అందించే ప్యాకేజీలతో లద్దాఖ్, లేహ్ వంటి ప్రాంతాలను హైదరాబాద్ నుండి వెళ్లి చూసేయచ్చు. ప్యాకేజీ వివరాలను చూస్తే.. ఇది ఆరు రాత్రుల ప్యాకేజీ. ఈ ప్యాకేజీ లో భాగంగా శామ్ వాలీ, లేహ్, నుబ్రా, టుర్టుక్, పాంగ్యాంగ్ ని చూడచ్చు. సెప్టెంబర్ 8, 23న మరో రెండో ట్రిప్స్ వున్నాయి కనుక వీటిని చూడచ్చు. దీని ధర వచ్చేసి రూ. 41,360 గా వుంది.
ఢిల్లీ నుండి లద్దాఖ్:
ఇది ఢిల్లీ లో మొదలు కానుంది. సెప్టెంబర్ 3, 5, 10, 12, 17, 19, 29 తేదీల్లో ట్రిప్స్ వున్నాయి. ప్యాకేజీ ధర రూ. 32,960.
కోల్కతా నుండి లేహ్ లద్దాఖ్:
సెప్టెంబర్ 11, 17, 23 తేదీల్లో ట్రిప్స్ వున్నాయి. ఇది కలకత్తా లో మొదలు కానుంది. ప్యాకేజీ ధర రూ. 41,500. లేహ్, నుబ్రా, టుర్టుక్, పాంగ్యాంగ్ మొదలైనవి సందర్శించవచ్చు.
లక్నో నుండి లద్దాఖ్:
సెప్టెంబర్ 7, 14, 21, 28న ట్రిప్స్ వున్నాయి. ప్యాకేజీ ధర రూ. 43,900.ఏడు రాత్రుల ట్రిప్ ఇది.
పూర్తి వివరాలను www.irctctourism.com లో చూడచ్చు.