వీడియో : మహిళా ఉద్యోగిని దారుణంగా కొట్టాడు.. ఎందుకో తెలుసా.!

తోటి ఉద్యోగులందరూ చూస్తుండగానే ఓ మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడి.. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి పడేశాడు డిప్యూటీ మేనేజర్‌. ఈ ఘాతుకమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.. దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ దారుణమైన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

నెల్లూరులోని ఏపీ టూరిజం ఆఫీసులో డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావు ముఖానికి మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చాడు. దీంతో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణి .. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని భాస్కర్ రావుకు సూచించింది. దీంతో సహనం కోల్పోయిన భాస్కర్ రావు.. దివ్యాంగురలైన ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. దాడి చేస్తోన్న సమయంలో అక్కడున్న  ఇతర ఉద్యోగులు భాస్కర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆమెను అతడి బారి నుంచి కాపాడారు. బాధితురాలితో కలిసి ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు.