లక్‌ కలిసి రావాలన్నా.. ఆరోగ్యం, ధనం కోసమైనా.. ఇంట్లో గుర్రం బొమ్మలను ఇలా పెట్టుకోవాలి..!

వాస్తుశాస్త్రం ప్రకారం గుర్రపు బొమ్మలు మన ఇండ్లలోకి పాజిటివ్‌ ఎనర్జీని తీసుకువస్తాయి. గుర్రం అంటే శక్తికి ప్రతీక అని కూడా ఈ శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఈ బొమ్మలను మనం ఇంట్లో మన చూపు పడే చోట ఉంచితే దాంతో అదృష్టం కలసిరావడమే కాదు, ధనం లభిస్తుంది. అనుకున్నవి నెరవేరుతాయి. దంపతుల మధ్య సమస్యలు ఉంటే పోతాయి. ఇంట్లో ఉన్నవారందరికీ ఆరోగ్యం కలుగుతుంది. అయితే గుర్రపు బొమ్మలను ఇంట్లో ఏ దిక్కున, ఏవిధంగా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

keep horse idols in home like this for luck and wealth and health

* ఇంట్లో పెట్టుకునే గుర్రపు బొమ్మలు గాల్లో ఎగురుతున్న భంగిమలో ఉండాలి. అలాగే వాటికి పగ్గాలు ఉండకూడదు.

* ఇంట్లో దక్షిణం దిశలో గుర్రపు బొమ్మలను ఉంచితే ఆరోగ్యం కలుగుతుంది. ధనం సంపాదిస్తారు. అన్ని విధాలా శుభం కలుగుతుంది.

* ఇంట్లో ఉత్తర దిక్కున గుర్రపు బొమ్మలను ఉంచితే అదృష్టం పెరుగుతుంది. మాకు లక్‌ కలసి రావడం లేదు అనుకునేవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

* ఆయా దిక్కుల్లో పెట్టే గుర్రపు బొమ్మల ఎదురుగా కిటికీలు, తలుపులు ఉండేలా చూడాలి. దీంతో ఇంట్లోకి శక్తి ప్రసారం అవుతుంది. అది అన్ని సమస్యలను దూరం చేస్తుంది.

* దంపతులు తమ బెడ్‌రూంలో గుర్రపు బొమ్మల జంటను పెట్టుకుంటే వారి మధ్య ఉండే కలహాలు తొలగిపోతాయి.

* చాలా మంది తమ ఇండ్లలో 7 గుర్రాలు ఉన్న వాల్‌పోస్టర్లను పెట్టుకుంటారు. ఇవి ఇంట్లో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీని తొలగిస్తాయి. పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతాయి. అదృష్టం కలసి వచ్చేలా చేస్తాయి.

* ఇంట్లో గుర్రపు బొమ్మ లేదా వాల్‌పోస్టర్‌లలో దేన్ని పెట్టుకున్నా సరే మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.