టీవీ సీరియ‌ల్ న‌టి లహరి అరెస్ట్ !

-

ప్ర‌ముఖ టీవీ సీరియ‌ల్ న‌టి లహరి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ లో త‌న కారుతో బైక్ ను సీరియల్ న‌టి ల‌హ‌రి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న వ్యక్తికి గాయాలు అయ్యాయ‌ని స‌మాచారం అందుతోంది. దీంతో ల‌హ‌రి కారును అక్క‌డి స్థానికులు అడ్డుకున్నారు.

అంతేకాదు… స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన శంషాబాద్ పోలీసులు…. కారుతో పాటు సీరియ‌ల్ న‌టి ని పోలీస్టేషన్ కు తరలించారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డు పై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి … డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ప్ర‌ మాదం చోటు చేసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. అయితే… ఇప్ప‌టి వ‌ర‌కు గాయ‌ప‌డ్డ వారి నుంచి ఎవ‌రూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌లేద‌ని.. తెలుస్తుంది. ఇక అటు ల‌హ‌రి మ‌ద్యం సేవించి… కారు న‌డిపిన‌ట్లు శంషాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news