జ‌ర్మ‌నీ లో సంకీర్ణ ప్ర‌భుత్వం.. దిగిపోనున్న ఎంజెలా మెర్కెల్

-

జ‌ర్మ‌నీ లో ఎంజెలా ముర్కెల్ త‌ర్వాత ఛాన్సెల‌ర్ గా ఎవ‌రు బాధ్య‌తులు నిర్వ‌హిస్తారా.. అనే ఉత్కంఠ కు తెర పడింది. జ‌ర్మనీ లో సోషల్ డెమోక్రాట్ పార్టీ కి చెందిన ఒలాఫ్ షోల్జ్ నేతృత్వం లో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ నుంది. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రి కూడా స్ప‌ష్ట మైన మెజారిటీ లేక పోవ‌డం తో జ‌ర్మ‌నీ ఛాన్సెల‌ర్ గా ఎవ‌రూ అవుతారా.. అనే ఉత్కంఠ ఉండేది. కానీ ఒలాఫ్ షోల్జ్ నేతృత్వం లో ఏర్ప‌డ్డ‌ ప్రోగ్రెసివ్ కూటమి వ‌ల్ల ఈ ఉత్కంఠ కు తెర ప‌డింది.

ఈ ప్రోగ్రెసివ్ కూటమి నుంచి ఒలాఫ్ షోల్జ్ ను జ‌ర్మనీ ఛాన్సెల‌ర్ గా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాల పై తాజా గా షోల్జ్ కు చెందిన సోషల్ డెమోక్రాట్ పార్టీ తో పాటు భాగ స్వాములు అయిన గ్రీన్ పార్టీ, ఫ్రీ డ‌మోక్రాట్ నేతలు సంతంకం చేశారు. దీంతో అధికారికం గా ఒప్పందం పై క్లారిటీ వ‌చ్చింది. దీని త‌ర్వాత మీడియా తో షోల్జ్ మాట్లాడారు. ప్ర‌స్తుతం త‌మ ముందు పెద్ద ప‌రీక్ష ఉంద‌ని అన్నారు. క‌రోనా నిలవ‌రించే విధం గా తమ అడుగులు ఉంటాయ‌ని తెలిపారు. అయితే దాదాపు 4 సార్లు.. అంటే 16 సంవ‌త్సరాల పాటు జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వ అధినేత గా ఉన్న ఎంజెలా మెర్కెల్ ఛాన్సెల‌ర్ బాధ్య‌త ల నుంచి దిగిపోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news