నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతిష్టాత్మక మ్యూజిక్ కంపెనీ.. చాయ్ బిస్కెట్ తో కలిసి..

-

లహరి మ్యూజిక్.. దక్షిణభారతంలో ప్రతిష్టాత్మక మ్యూజిక్ సంస్థగా ఉన్న లహరి మ్యూజిక్ కొత్త రంగంలోకి అడుగుపెడుతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాల పాటలని సొంతం చేసుకున్న ఈ సంస్థ నుండి సినిమాలు రాబోతున్నాయి. లహరి ఫిలిమ్స్ పేరుతో సినిమా నిర్మాణంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐతే వీరితో డిజిటల్ కంటెంట్ క్రియేటర్ చాయ్ బిస్కెట్ జత కడుతుండటం విశేషం. యూట్యూబ్ వేదికగా చాలా కంటెంట్ ని ప్రేక్షకుల ముందు ఉంచిన చాయ్ బిస్కెట్, ఇప్పుడు లహరి మ్యూజిక్ తో కలిసి నిర్మాణంలోకి అడుగుపెడుతుంది.

లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే ఉండనున్నారట. వీరి కలయికలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఫస్ట్ లుక్ ని 2021 జనవరి 1వ తేదీన రిలీజ్ చేస్తారట. కొత్త నిర్మాణ సంస్థ కొత్తగా నిర్మిస్తున్న సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరనేది ఫస్ట్ లుక్ విడుదల రోజే తెలుస్తుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news