మెగా ఫ్యామిలీలో శ్రీరెడ్డికి నచ్చిన వ్యక్తి ఉన్నారా.. ఏంటి శ్రీరెడ్డి కొత్త టర్న్..!

49

తన సోషల్ బ్లాగ్స్ ద్వారా.. మీడియా ముందుకొచ్చినా మెగా ఫ్యామిలీ మీద తన వీర ప్రతాపం చూపించే శ్రీరెడ్డి లేటెస్ట్ గా ఓ కామెంట్ తో అందరికి షాక్ ఇచ్చింది. మెగా ఫ్యామిలీలో తనకు నచ్చిన వ్యక్తి ఉన్నారని షాక్ ఇచ్చింది. చిరంజీవి ఫ్యామిలీ నుండి నాకు ఒకరంటే ఇష్టం.. తను ఎవరో తెలుసా ఎనీ గెస్ అని శ్రీరెడ్డి ఓ మెసేజ్ పెట్టింది. అయితే దానికి సమాధానంగా అందరు రాం చరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరి పేర్లు చెప్పారు నెటిజెన్లు.

కాని శ్రీరెడ్డి మాత్రం ఫైనల్ గా అది ఎవరో కాదు ఉపాసన రెడ్డి కామినేని అని చెప్పింది. గొప్ప వ్యక్తి, స్వీట్ పర్సన్, కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి, ఫ్యామిలీ లేడీ, సక్సెస్ ఫుల్ లేడీ ఇలా ఉపాసన మీద తన అభిమానం చాటుకుంది శ్రీరెడ్డి. అయితే ఉపాసన కామినేని.. ఉపాసన కొణిదెల మారి చాలా రోజులైంది కాని మెగా ఫ్యామిలీ మీద చురక వేయనిది నిద్ర పట్టదు కదా అందుకే శ్రీరెడ్డి అలా సంభోదించి ఉండొచ్చు. ఇంతకీ ఉపాసన మీద అమ్మడి ఈ స్పెషల్ అండ్ సర్ ప్రైజ్ కామెంట్స్ ఎందుకు ఏంటి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.