ఈటలపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు .. నిజమైన ఉద్యమకారుడేనా !

-

ఈటలపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈట‌ల రాజేంద‌ర్‌నుపై విమ‌ర్శ‌లు చేస్తూ.. అస‌లు ఆయ‌న నిజ‌మైన ఉద్య‌మ‌కారుడేనా అని ప్ర‌శ్నించారు. తాను తెలంగాణ ఉద్యమ సమయంలో లేకపోయినా… ఈటల రాజేందర్ విషయంలో స్పందించకపోతే తప్పవుతుందని దానం నాగేందర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిజమైన ఉద్యమకారుడు అయితే.. ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే వాడు కాదని మండిపడ్డారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు దానం నాగేందర్.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈటల వ్యవహరించిన తీరు వల్ల బలహీన వర్గాలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని.. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు నిజమైన నాయకుడికి ఎల్లవేళలా నమ్మే ఉంటారని పేర్కొన్నారు. రైతు బంధును వ్యతిరేకించిన ఈటల… తన భూమికి రైతు బంధు చెక్కులు ఎందుకు తీసుకున్నాడని ఫైర్ అయ్యారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపరిస్తే… త్వరలోనే బడుగు, బలహీన వర్గాలు ఈటల రాజేందర్ కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news