విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 5వ రోజు రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారు భక్తులకి దర్శనం ఇష్తున్నారు. అయితే ఈర్పోజు మూలా నక్షత్రం.. సరస్వతి అలంకరణ సందర్భంగా సీఎం చేతుల మీదుగా మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది.
కానీ ఈలోపు అక్కడ కొండ చరియలు విరిగిపడడం సంచలనంగా మారింది. మూడు రోజులుగా చిన్న చిన్న రాళ్లు విరిగిపడుతున్నాయి. దీంతో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు అధికారులు. అలాంటిది ఇవాళ కొండ చరియలే విరిగి పడ్డ్డాయి. మరి కాసేపట్లో దుర్గగుడికి సిఎం జగన్ చేరుకోకున్న నేపధ్యంలో ఈ ఘటన జరగడంతో అధికారులలో ఆందోళన నెలకొంది. దర్శనం కోసం వెళ్ళే భక్తుల కోసం వేసిన టెంట్ లు అయితే ద్వంశం అయ్యయ్యి. అలానే ముగ్గురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.