లతా మంగేష్కర్ ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమ 1929 సెప్టెంబర్ 28న జన్మించారు. ముఖ్యంగా వారి కుటుంబం పాటల పొదరిల్లు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీత కళాకారుడు. ఆయనకు ఐదుగురు మంది పిల్లలు. వారిలో లతనే అందరికంటే పెద్ద. లత తరువాత ఆశ, హృదయనాథ్, ఉష, మీనా ఉన్నారు. తండ్రి దీననాథ్ మరణంతో ఇంటి భారం చిన్నారి లతపైనే పడింది. కొన్ని చిత్రాల్లో బాలనటిగా నటించారు. లత, తరువాత రోజుల్లో లత గాయనిగా మారి ప్రి పాటలో అమృతం కురిపించారు.
అంతేకాదు 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో ఏఎన్నార్ జాతీయ పురస్కారం లతా మంగేష్కర్‌కు లభించాయి. వీటితో పాటు భారతరత్న, పద్మ విభూషన్ అవార్డు కూడా వరించింది. జనవరి 08న కరోనా కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరింది. దాదాపు 29 రోజుల పాటు చికిత్స పొంది మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామెజీ కావడంతో ఆదివారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు కన్నూమూశారు లతా మంగేష్కర్. దాదాపు 8 దశాబ్దాల కాలం పాటు తన గానాన్ని ప్రపంచ వ్యాప్తంగా వినిపించారు. ముబైంలోని శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.