ప్రముఖ నేపథ్య గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ మరణించారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో… ముంబయ్ లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు లతా మంగేష్కర్. జనవరి లో కరోనా బారిన పడిన లతా మంగేష్కర్.. దాదాపు 20 రోజుల పాటు కరోనా మహమ్మారితో పోరాటం చేసి.. ఇవాళ మరణించారు.
ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ ను ఐసీయూలో ఉంచి ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కు చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ.. ఆమె ఆరోగ్య మెరుగుపడలేదు. ఇక 92 ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్ కొవిడ్ భారినపడి మరణించడం జీర్ణించుకోలేకపోతున్నారు సిని సంగీత అభిమానులు.
ఇది ఇలా ఉండగా… భారతరత్న లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల రెండు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ముబైంలోని శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.