ఆ సంస్థలో ఉద్యోగ అవకాశాలు..డైరెక్ట్ ఇంటర్వ్యూ..

-

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (NIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. జంధర్‌లోని డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వివిధ సబ్జెక్టుల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ ఉద్యోగాల గురించి పూర్తీ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

మొత్తం వివరాలు..

* మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హ్యుమానిటీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ. 80,000, నాన్‌ పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ. 67,000 జీతంగా చెల్లిస్తారు.

* ఇంటర్వ్యూలను జులై నెలలో 18 నుంచి 23 వ తేదీ వరకు నిర్వహిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు 04-07-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news