ఇప్పుడు ఏపీలో అధికార పార్టీలో ఎక్కడాలేని ఖుషీ కనిపిస్తోంది. పార్టీని నమ్ముకున్న నాయకులు, పార్టీకో సం కృషి చేసిన నాయకులు.. మంచి గుర్తింపు పొందుతున్నారు. అంతేకాదు, నిన్నమొన్నటి వరకు పార్టీ కోసం అనేక రూపాల్లో పనిచేసి, అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా తిరిగిన వారు పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత, జగన్ సీఎం అయిన తర్వాత తమతమ పనులలో నిమగ్నం అయిపోయారు. అయి తే, అలాంటి వారిని అందరినీ వెతికి పట్టుకుని మరీ జగన్ రుణం తీర్చుకుంటున్నారు.
ఇక, రాజకీయాల నుంచి కనుమరుగయ్యారులే అనుకున్న వారికి కీలకమైన పదవులు ఇచ్చి సంతోష పెడుతున్నారు. వాస్తానికి ఇలాంటి పరిస్థితి గతంలో అధికారంలో ఉన్న టీడీపీలో మచ్చుకు కూడా కనిపించేది కాదని అం టారు ఆపార్టీ సీనియర్లు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు, పరోక్ష ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గుంటూ రుకు చెందిన రాయపాటి సాంబశివరావు టీటీడీ చైర్మన్ గిరీకోసం అనేక విధాలుగా చంద్రబాబును వేడుకున్నారు. అయినప్పటికీ.. ఫలితం కనిపించలేదు.
ఇక, మంత్రి వర్గంలో చోటు కోసం ఎంతో సీనియర్ అయి న బుచ్చయ్య చౌదరి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇలా చెప్పుకొంటూ ..పోతే.. ఇలాంటి సీనియ ర్లు చాలా మందే ఉన్నారు. వీరు ఎలాంటి గుర్తింపునకు నోచుకోలేక పోవడంతో స్థానికంగా పార్టీపై ఎఫెక్ట్ పడిందని చెప్పడంలో ఎలాం టి సందేహం లేదు. అయితే, ఇలాంటి పరిస్థితిని ముందుగానే గుర్తించిన జగన్.. తనదైన శైలితో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి చేస్తున్నారు. వీరిలో వృద్ధులైన నాయకులు కూడా ఉండడం గమనార్హం.
నందమూరి లక్ష్మీపార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఇప్పుడు విజయచందర్‌లకు జగన్ కేబినెట్ హోదా ఉన్న పదవులను అప్పటించారు. తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం, అత్యంత కీలమైన ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పదవులను అప్పగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంటే.. టీడీపీలో మాత్రం తీవ్ర నిరాశ వ్యక్తమవుతుండడం గమనార్హం.