వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా అదే జరిగింది. లీటర్ పెట్రోల్ పై నేడు 36 పైసలు…లీటర్ డీజిల్ పై 38 పైసల చొప్పున పెరిగాయి. ఇక పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.27 కు చేరింది. అంతే కాకుండా లీటర్ డీజిల్ ధర రూ.105.46 కు చేరింది.
అదే విధంగా ఏపీలోని గుంటూరులో పెట్రోల్ ధర రూ.114.30 గా ఉండగా..డీజిల్ ధర రూ. 106.52 గా ఉంది. ఇదిలా ఉంటే దేశం లో అత్యధికంగా రాజస్థాన్ గంగానగర్ లో పెట్రోల్ ధర రూ.120 కు చేరింది. ఇక వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం తో ఆ ప్రభావం నిత్యావసరాల పై చూపిస్తోంది. దాంతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మరో వైపు గ్యాస్ ధరలు కూడా భారీగా పెంచే ఆలోచనలలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.