ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

indian post
indian post

సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) సంస్థలో పలు కేటగిరీల్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. 2021 డిసెంబర్ 15 ఈ పోస్టులకి అప్లై చెయ్యడానికి చివరి తేదీ. దీనిలో మొత్తం 29 ఖాళీలు వున్నాయి. దీనిలో అసిస్టెంట్ మేనేజర్, టెక్నికల్ సూపర్‌వైజర్ లాంటి పోస్టులున్నాయి.

డిప్యుటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇది ఇలా ఉంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సబార్డినేట్ ఆఫీసుల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. టెక్నికల్ సూపర్‌వైజర్ పోస్టుకు అయితే ఏడాది అనుభవం ఉండాలి. వయస్సు అయితే 56 ఏళ్ల లోపు ఉండాలి.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 23 వున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక ఏడాది డిప్లొమా ఉండాలి. అలానే టెక్నికల్ సూపర్‌వైజర్ పోస్టులు 6 వున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక ఏడాది డిప్లొమా ఉండాలి. ఇక శాలరీ విషయానికి వస్తే.. రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది. పూర్తి వివరాలని https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_21102021_CEPT.pdf లో చూడచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే విజ‌య‌ప‌థం.కామ్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news