“గుంటూరుకారం” నుండి క్రేజీ న్యూస్…మహేష్ ఫ్యాన్స్ కు పండగే !

-

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అటు క్లాస్ ఇటు మాస్ ఇద్దరినీ సంతృప్తి పరిచే అంశాలున్నాయని చిత్ర బృందం బలంగా నమ్ముతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి రెండవ సింగిల్ కు సంబంధించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈయన చెబుతున్న ప్రకారం వచ్చే వారమే గుంటూరుకారం రెండవ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండగా మరో మూడు పాటలు ఏ విధంగా ఉంటాయని అభిమానులు ఆతృతగా ఎదరుచూస్తున్నారు. కాగా ఎస్ ఎస్ థమన్ సమకూర్చిన సంగీతంలో ఈ పాటలు ఏ రేంజ్ లో ఉండనున్నాయన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news