ఆసుస్‌ నుంచి మరో నాలుగు కొత్త ల్యాప్ టాప్స్ లాంచ్.. ధర ఎంతంటే?

-

ఆసుస్‌ కంపెనీ ల్యాప్ టాప్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఆసుస్‌ జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీ, జెన్‌బుక్‌ 14X ఓఎల్‌ఈడీ స్పేస్‌ ఎడిషన్‌, ఆసుస్‌ వీవో బుక్‌ ఎస్‌14/15 ఓఎల్‌ఈడీ, వీవోబుక్‌ 14/15 సిరీస్‌ ల్యాప్‌టాప్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది.వాటి ప్రత్యేకలు, ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఆసుస్ జెన్‌బుక్‌ 14X ఓఎల్‌ఈడీ స్పేస్‌ ఎడిషన్‌:

ఇంటెల్‌ కోర్‌ ఐ9 హెచ్-సిరీస్‌ మొబైల్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 32జీబీ ఎల్‌పీడీడీఆర్‌5 4800 ఎమ్‌హెర్జ్‌ ర్యామ్‌ ఇస్తున్నారు. 6500 ఎంబీ రీడ్‌ స్పీడ్‌తో 1టీబీ హైస్పీడ్‌ ఎస్‌ఎస్‌డీతో పనిచేస్తుంది. దీనిలోనూ మల్టీటాస్కింగ్‌ కోసం ప్రత్యేకంగా ఆసుస్ నెంబర్‌ ప్యాడ్‌ 2.0ను ఇచ్చారు. సీపీయూలో డ్యూయల్‌ ఫ్యాన్‌ ఐస్‌కూల్‌ టెక్నాలజీ వాడారు. వేగంగా లాగిన్‌ అవ్వడానికి ఫాస్ట్‌ ఫింగర్‌ప్రింట్‌ లాగిన్‌ సదుపాయం ఉంది. వైఫై, బ్లూటుత్ తో సహా అన్నీ ఫీచర్స్ ఉన్నాయి.ఇండియా లో ఈ ల్యాప్ టాప్ ధర 1,14,990గా ఉంది.అన్నీ ఆన్లైన్ స్టోర్ లలో అందుబాటులో ఉంది.

ఆసుస్‌ జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీ:

ఈ 14 ల్యాప్‌టాప్‌లో 12 జెనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7-1260పీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 16జీబీ ఎల్‌పీడీడీఆర్‌5 ర్యామ్‌, 512జీబీ ఎస్‌ఎస్‌డీతో పనిచేస్తుంది. ఐరీష్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్‌ కార్డ్‌ను వాడారు. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేటుతో 14 అంగుళాల డిస్‌ప్లేను ఇస్తున్నారు. దీనిలోనూ ఆసుస్ నెంబర్‌ ప్యాడ్‌ 2.0ను ఇచ్చారు. బాడీ రేషియో 90శాతం వరకు ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ స్పీకర్లు, ప్రైవసీ షెట్టర్‌తో 720పీ వెబ్‌క్యామ్‌ సదుపాయం ఉంటుంది..ఒకసారి చార్జ్ చేస్తె 76 గంటలు పని చేస్తుంది.దీని ధర 89,900 గా ఉంది.

ఆసుస్‌ వీవో బుక్‌ ఎస్‌14/15 ఓఎల్‌ఈడీ:

రెండింటి బరువులో చిన్న వ్యత్యాసం ఉంది. ఎస్‌14 బరువు 1.5కేజీలు కాగా.. ఎస్‌15 బరువు 1.8 కేజీలు ఉంటుంది. రెండింటిలో 70గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం ఉంది. 90వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పనిచేస్తుంది. 12జెనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌నే వాడారు. ఐ7-1200హెచ్‌ కాన్‌ఫిగరేషన్‌తో పనిచేస్తాయి. ఫాస్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌ లాగిన్‌, 3డీఎన్‌ఆర్‌ వెబ్‌క్యామ్‌, ఏఐ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మొదలగు ప్రత్యేకలు ఉన్నాయి.దీని ధర 74,900 గా ఉంది.

వీవోబుక్‌ 14/15 సిరీస్‌ ల్యాప్‌టాప్‌:

ఈ ల్యాప్‌టాప్‌లో 12 జెనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఐ5-1240పీ కాన్‌ఫిగరేషన్‌, విండోస్‌ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 14/15.6 అంగుళాల స్క్రీన్‌లలో లభ్యమవుతుంది. 19.9ఎంఎం మందంతో 1.5కేజీ/1.7 కేజీ బరువుతో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 42గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం ఉంది. 65వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది..అన్నీ సదుపాయాలను కలిగి ఉంది. ఇండియా మార్కెట్ లో దీని ధర రూ.42,990గా కంపెనీ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news